ఘనంగా ఆది పినిశెట్టి- నిక్కీగల్రానీ ల వివాహం
Aadhi Pinisetty and Nikki Galrani are now husband and wife.ఆది పినిశెట్టి - నిక్కీగల్రానీల వివాహాం బుధవారం రాత్రి
By తోట వంశీ కుమార్ Published on 19 May 2022 11:51 AM ISTఆది పినిశెట్టి - నిక్కీగల్రానీల వివాహాం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటైయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన నాని, సందీప్ కిషన్ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్ స్టెప్పులేశారు.
ఆది పినిశెట్టి - నిక్కీగల్రానీ ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల కోసం ఈ జంట త్వరలోనే రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
2015 లో వచ్చిన తమిళ చిత్రం 'యాగవరాయినమ్ నా కాక్క'లో తొలిసారి ఆది పినిశెట్టి, నిక్కీ కలిసి నటించారు. ఈ చిత్రం తెలుగులోను 'మలుపు' పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తరువాత వచ్చిన 'మరగాధ నాణ్యం' సినిమాతో మరింత దగ్గరయ్యారట. ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారట. తమ విషయాన్ని పెద్దల వాళ్లకు చెప్పగా వారు అంగీకరించడంతో బుధవారం ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.
'గుండెల్లో గోదారి','ఒక విచిత్రం','సరైనోడు', 'నిన్నుకోరి', 'రంగస్థలం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆదిపినిశెట్టి. ప్రస్తుతం ఆయన రామ్ పోతినేని ద్విభాష చిత్రం 'ది వారియర్'లో ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు.