థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. రిలీజ్‌ ఎప్పుడంటే..

‘Aadavaallu Meeku Johaarlu’ to release on Feb 25. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా దర్శకుడు తిరుమల కిషోర్ తెరకెక్కిస్తున్న చిత్రం

By Medi Samrat  Published on  29 Jan 2022 12:47 PM IST
థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ ఆడవాళ్లు మీకు జోహార్లు.. రిలీజ్‌ ఎప్పుడంటే..

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా దర్శకుడు తిరుమల కిషోర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధాకర్ చెరుకూరి.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇంకా ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పాట చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని.. ఈ చిత్రం మహిళా ప్రధానాంశంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్‌లతో శర్వానంద్‌కి ఇది మొదటి చిత్రం. రష్మిక మందన్న కూడా తొలిసారి శర్వానంద్‌తో జ‌త‌క‌డుతుంది. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కింటి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడ‌ని చెబుతున్నారు. ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ విజువల్స్ అందించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.




Next Story