లలిత్‌మోదీ కంటే ముందు 10 మందితో సుస్మితా డేటింగ్‌..!

A look at the men Sushmita Sen dated before Lalit Modi.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) వ్య‌వ‌స్థాప‌కుడు లలిత్ మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 9:53 AM IST
లలిత్‌మోదీ కంటే ముందు 10 మందితో సుస్మితా డేటింగ్‌..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) వ్య‌వ‌స్థాప‌కుడు లలిత్ మోదీ, బాలీవుడ్ న‌టి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ప్రేమ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ప్ర‌స్తుతం తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామ‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటామ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ల‌లిత్‌మోదీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో వీరిద్ద‌రు ప్రేమంచుకోవ‌డం ఏంటి అంటూ చాలా మంది షాక్‌కు గుర‌వుతున్నారు. మ‌రికొంద‌రు అయితే లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సుష్మితా వయసు 46 కాగా.. లలిత్‌ మోదీ వయసు 56 ఏళ్లు.

కాగా.. మొన్నటి దాక తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో మూడేళ్లు సహాజీవనం చేసిన సుస్మితా అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసింది. ఇప్పుడు త‌న‌కంటే 11 ఏళ్లు పెద్ద‌వాడైనా ల‌లిత్ మోదీతో డేటింగ్ చేస్తుండ‌డంతో అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు సుస్మితా ఎంత మందితో డేటింగ్ చేసింద‌ని నెటీజ‌న్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సుస్మితా 10 మందితో డేటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. డైరెక్ట‌ర్ విక్రమ్ భట్, పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్, చిత్ర నిర్మాత ముదస్సర్ అజీజ్, వ్యాపార వేత్త‌లు అయిన సంజయ్ నారంగ్, సబీర్ భాటియా, రితిక్ భాసిన్, చిత్ర నిర్మాత మానవ్ మీనన్, సెలబ్రిటీ మేనేజర్ బంటీ సజ్దేహ్, నటుడు రణదీప్ హుడా, మోడల్ రోహ్మాన్ షాల్ ల‌తో గ‌తంలో సుస్మితా డేటింగ్ చేసింది.

Next Story