వాళ్లు నన్ను దెబ్బతీశారు.. పెళ్లి కూడా చేసుకోలేకపోయా.. పూనమ్‌కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

A few people destroyed my career..Poonam Kaur. టాలీవుడ్‌లో వివాదాస్పద నటీమణుల్లో పూనమ్ కౌర్ ఒకరు. అందం, అభినయం కలిగిన ఈ నటికి ప్రస్తుతం ఎలాంటి

By అంజి  Published on  9 March 2022 9:34 AM IST
వాళ్లు నన్ను దెబ్బతీశారు.. పెళ్లి కూడా చేసుకోలేకపోయా.. పూనమ్‌కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో వివాదాస్పద నటీమణుల్లో పూనమ్ కౌర్ ఒకరు. అందం, అభినయం కలిగిన ఈ నటికి ప్రస్తుతం ఎలాంటి సినిమా ఆఫర్లు రావడం లేదనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీ కొంతమంది టాలీవుడ్ ప్రముఖులపై తరచుగా సంచలన వ్యాఖ్యలు చేయడంలో పేరుగాంచింది. మీడియాతో తన తాజా ఇంటరాక్షన్‌లో.. పూనమ్ కౌర్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇటీవలి కాలంలో తాను భరించాల్సిన వ్యక్తిగత అవమానాలు, తగిలిన గాయాల గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పూనమ్‌ కౌర్‌ తాజాగా నటించిన "నాతిచరామి" సినిమా ఓటీలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

"నేను ఇటీవల మానసికంగా, కెరీర్‌కు సంబంధించిన చాలా నష్టాన్ని చవిచూశాను. కొంతమంది నా కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నించారు, కానీ నేను గట్టిగా నిలబడ్డాను. ఈ ప్రభావవంతమైన వ్యక్తులు నాకు పెద్ద సినిమా అవకాశాలను లేకుండా చేసారు. వారు స్వార్థ ప్రయోజనాలతో నన్ను ఇలా చేశారు. నేను సీతా దేవి, ద్రౌపది నుండి స్ఫూర్తిని పొంది వారిపై ఉత్కంఠభరితంగా పోరాడుతున్నాను" అని పూనమ్ ఇంటరాక్షన్‌లో తెలిపారు. ఈ ప్రభావవంతమైన వ్యక్తులు తనను ఎంతగానో దెబ్బతీశారని, తాను పెళ్లి కూడా చేసుకోలేకపోయానని, అమెరికాకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండాల్సి వచ్చిందని పూనమ్ చెప్పింది. పూనమ్ పేర్లు చెప్పలేదు కానీ ఆమె స్పష్టంగా తెలుగు సినిమాలోని కొంతమంది పెద్దల వైపు వేళ్లు చూపుతోంది.

Next Story