సినీ హీరో పై కేసు నమోదు!

టాలీవుడ్‌ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది.

By అంజి  Published on  26 Nov 2024 1:34 PM IST
Tollywood actor, Sritej, Kukatpally police station, Hyderabad

సినీ హీరో పై కేసు నమోదు!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీ తేజ్ పై బీఎన్‌ఎస్‌ 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ అతడిపై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో వివాదం చెలరేగింది. కాగా శ్రీతేజ్‌ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాలో చంద్రబాబు రోల్‌ చేశారు. వంగవీటి, పుష్ప ది రైజ్‌, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్‌ ప్రస్తుతం 'పుష్ప ది రూల్‌'లో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరంపరం, బహిష్కరణ అంటూ మంచి వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించి గుర్తింపు పొందాడు.

Next Story