చిలిపి గొడవల 'ఖుషి'.. 20 సంవత్సరాల అనుభూతి

20 Years Of Kushi. ఖుషి.. ఈ సినిమా విడుదలై నేటితో 20 సంవత్సరాలు.

By Medi Samrat  Published on  27 April 2021 9:54 AM GMT
Kushi completed 20 years

ఖుషి.. ఈ సినిమా విడుదలై నేటితో 20 సంవత్సరాలు..! ఈ సినిమా నచ్చని సినీ అభిమాని అంటూ ఉండరు. యంగ్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని లవ్ ట్రాక్ ఎప్పటికీ స్పెషల్..! మధు, సిద్ధార్థ్ లకు ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పటికీ.. వారికి ఉన్న ఈగోల కారణంగా చెప్పుకోలేరు. ఇక బాబు, శాంతిల ప్రేమను గెలిపించడానికి వీళ్ళిద్దరూ కలిసి పడే పాట్లను కూడా దర్శకుడు ఎస్.జె.సూర్య ఎంతో చక్కగా చూపించారు.

టాలీవుడ్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీల గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఖుషి సినిమా గురించే చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ స్టైల్ తో అమ్మాయిలను కట్టి పడేస్తాడు. భూమిక అందానికి, అమాయకత్వానికి అందరూ ఫ్లాట్ అనుకోండి. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. పవన్ హెయిర్ స్టైల్, చిలిపి నవ్వు.. ఇవన్నీ చూసి పవన్ ఇంకొన్ని సినిమాలు కాలేజీ బ్యాగ్డ్రాప్ లో చేసుంటే బాగుండేది అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

సినిమాకు సంగీతం ఎంతో ప్లస్ అయ్యింది. మణిశర్మ అందించిన బాణీలు ఆల్ టైమ్ హిట్స్ అయ్యాయి. అంతెందుకు సినిమాలో సిద్ధు.. మధు నడుము చూసే సీన్ ను ఊహించుకుంటే చాలు ప్రతి ఒక్కరికీ ఆ సన్నివేశంలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చెవుల్లో వినిపిస్తుంది. రాజేంద్ర కుమార్ రాసిన డైలాగ్స్ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటే ఇప్పటికీ ఎంతో ట్రెండీగా అనిపిస్తాయి. ఇక పి.సి.శ్రీరామ్ కెమెరా పనితనం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 27, 2001న విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు.. సినిమా ప్రేమికులకు కూడా ఎంతో మధురానుభూతిని నింపుతుంది. గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఖుషీ రిఫరెన్స్ ను వాడారు అంటే అభిమానుల మీద ఎంత ఇంపాక్ట్ కలిగించిందో ఈ సినిమా అర్థం చేసుకోవచ్చు.Next Story
Share it