సినీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. జస్ట్‌ రూ.699కే నెలంతా థియేటర్‌లో సినిమాలు

సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. ప్రముఖ సినిమా చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ 'పీవీఆర్‌ ఐనాక్స్‌ పాస్‌పోర్ట్‌' అనే కొత్త ఆఫర్‌ని ప్రకటించింది.

By అంజి  Published on  15 Oct 2023 2:30 AM GMT
PVR INOX, PVR INOX Passport, cinema, Tollywood, Movie audience

సినీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. జస్ట్‌ రూ.699కే నెలంతా థియేటర్‌లో సినిమాలు

సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. ప్రముఖ సినిమా చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ 'పీవీఆర్‌ ఐనాక్స్‌ పాస్‌పోర్ట్‌' అనే కొత్త ఆఫర్‌ని ప్రకటించింది. శనివారం నాడు ఈ ప్రకటన చేసింది. ప్రేక్షకులను మళ్లీ మళ్లీ క్రమం తప్పకుండా థియేటర్లలోకి తీసుకువచ్చే ప్లాన్‌తో ఈ సబ్‌స్క్రిప్షన్‌ పాస్‌ని తీసుకొస్తోంది. ఇది నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్. దీని ద్వారా సినిమా ప్రేక్షకులు నెలవారీ రుసుముతో నెలకు గరిష్టంగా 10 సినిమాలను చూడవచ్చు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్ అక్టోబర్ 16 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.699 ఖర్చు అవుతుంది.

సబ్‌స్క్రిప్షన్ పాస్ సోమవారం నుండి గురువారం మధ్య పని చేస్తుంది. ఐమ్యాక్స్‌, గోల్డ్, LUXE, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం సర్వీస్‌లలో పని చేయదు. కనీసం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ వ్యవధికి 'పీవీఆర్‌ ఐనాక్స్‌ పాస్‌పోర్ట్‌'ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిడీమ్‌ చేసుకోవడానికి ప్రేక్షకులు ట్రాన్సాక్షన్‌ చెక్‌ అవుట్‌ టైంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్‌ కూపన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ టికెట్లు కొన్నట్లయితే.. ఒక టికెట్‌కి మాత్రమే పాస్‌పోర్ట్‌ కూపన్‌ని వినియోగించవచ్చు. ఈ పాస్‌పోర్ట్‌ని ఒకరే వినియోగించడానికి వీలుంటుంది. థియేటర్‌లోకి వెళ్లే ముందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. కాగా సినీ కస్టమర్ బేస్‌తో కంపెనీ నిమగ్నమై ఉందని PVR INOX Ltd కో-సీఈవో గౌతమ్ దత్తా అన్నారు.

అలాగే మిడ్ లెవెల్, స్మాల్ బడ్జెట్ సినిమాలకు ఈ ట్రెండ్ ఆరోగ్యకరమైనది కాదన్నారు. ఈవెంట్ సినిమాలు పెద్దవిగా మారుతున్నాయని, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. అయితే ఈ స్కీమ్‌ సినీ ప్రేక్షకులను తిరిగి సినిమాల్లోకి చేర్చుతుందని అన్నారు. ఇక కంపెనీ ఇటీవల ఆహారం, పానీయాల ధరలను 40 శాతం తగ్గించింది. ఇది సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల మధ్య రూ.99 నుంచి ప్రారంభమయ్యే ఫుడ్‌ కాంబోలను పరిచయం చేసింది.

Next Story