ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో దాదాపు 30 గంటల పాటు ఈ కాల్పుల ఆపరేషన్‌ హోరాహోరీగా సాగింది. కసాల్పవాడ్‌ అటవీ ప్రాంతంలో ఈ భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటన ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.