కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ అడవుల్లో శనివారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే.. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత భాస్కర్ తప్పించుకున్నట్టు సమాచారం.

కాగజ్‌నగర్ మండలం, ఈజ్‌గామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంబ అడవుల్లో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోయిస్టులు తారసబడ్డారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో రెండు ఏకె47 తుపాకులతోపాటు మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.