విశాఖట్నం: ఏవోబీ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. జీకే వీధి మండలం మాడిమల్లు దగ్గర పోలీసులకు – మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.  వారిలో  మావోయిస్ట్ అగ్రనేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  మావోయిస్టుల వారోత్సవాల జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో మన్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.  ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.  ఏవోబీలో గ్రేహౌండ్స్ దళాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Image result for visakhapatnam encounter

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.