కాల్పులతో దద్దరిల్లిన విశాఖ ఏజెన్సీ..ఐదుగురు మావోలు హతం!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 22 Sept 2019 3:12 PM IST

విశాఖట్నం: ఏవోబీ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. జీకే వీధి మండలం మాడిమల్లు దగ్గర పోలీసులకు - మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. వారిలో మావోయిస్ట్ అగ్రనేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల వారోత్సవాల జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో మన్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఏవోబీలో గ్రేహౌండ్స్ దళాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Next Story