ఈఎస్‌ఐ వారికి కేంద్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

By సుభాష్  Published on  15 Feb 2020 9:24 AM GMT
ఈఎస్‌ఐ వారికి కేంద్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ (ఈఎస్‌ఐ) వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. తాజాగా గర్భిణీ స్త్రీలకు ఈఎస్‌ఐ ఖర్చులను పెంచుతున్నట్లు ప్రకటిచింది. రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.2,500 పెంచింది. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కాకుండా ఇతర ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే వారికి ఈ డబ్బులు అందజేయనున్నారు.

కాగా, రూ. 7,500 పొందాలంటే మహిళలు ఈఎస్‌ఐ డిస్పెన్సరీల నుంచి, ఇతర మెటర్నిటీ సర్వీసులు పొందకూడదు. ఇలాంటి వారికి ఈ డబ్బులు అందజేయనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఈఎస్‌ఐ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈఎస్‌ఐ పెంపునకు కారణం ఇదే..

ఈఎస్‌ఐ గర్భిణులకు ఇచ్చే పరిహారం పెంచుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్ర సర్కార్‌. ప్రస్తుతం జీవన వ్యయం పెరుగుదల నేపథ్యంలో కన్పిన్‌మెంట్‌ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న కన్ఫిన్‌మెంట్‌ వ్యయాన్ని రూ. 5వేల నుంచి 7వేల 500 వరకు పెంచుతూ నిర్ణయించింది.

కాగా, ఈఎస్‌ఐ 2020-21 ఆకాడమిక్‌ ఇయర్‌కు సంబంధించి ఈఎస్‌ఐసీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈడబ్ల్యూఎస్‌, ఆడ్మిషన్‌కు ఆమోదం తెలిపింది. అలాగే ఇన్సూర్డ్‌ పర్సన్స్‌ కోటా కింద ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల అడ్మిషన్‌కు కూడా ఆమోదం తెలిపింది.

కేంద్ర సర్కార్‌ ఇటీవల ఉద్యోగి ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ తగ్గించింది. కంపెనీ కంట్రిబ్యూషన్‌ 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ 1.75 శాతం నుంచి రూ.0.75 శాతానికి తగ్గించింది. దీంతో 3.6 కోట్ల మంది ఉద్యోగులు, 12.85 లక్షల మంది యజమానులకు ప్రయోజనం లభించింది. దీని వల్ల సంస్థలకు రూ.5వేల కోట్ల వరకు ఆదా కానుంది.

ఈఎస్‌ఐ లాభాలు

ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ వల్ల సమగ్రమైన సామాజిక భద్రత పొందే అవకాశం ఉంది. మెడికల్‌ కేర్‌, క్యాష్‌ బెనిఫిట్స్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. నెలకు రూ. 21వేల లోపు వేతనం ఉన్నవారికి ఈఎస్‌ఐ వర్తిస్తుంది. వీరికి ఈఎస్‌ఐ కార్డ్‌ అందిస్తారు. ప్రస్తుతం 13.5 కోట్ల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులున్నారు.

Next Story