హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం అత్యవసర ల్యాడింగ్‌ అయ్యింది. దోహా నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న విమానంలో సోయబ్‌ (65) అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో పైలెట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. అనంతరం ప్రయాణికుడిని విమానాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రయాణికుడు మృతి చెందాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story