చిత్తూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌తో ఏనుగు మృతి చెందింది. పలమనేరు నియోజకవర్గం బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఫారెస్ట్‌ అధికారులు ట్రాక్టర్ల సహాయంతో అడవిలోకి మళ్లీంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని ఓ ఏనుగు విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. స్తంభం విరిగిపడడంతో కరెంట్‌ వైర్లు తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.

Elephant died in chittoor

ఇటీవల విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని నాగావళి నదితీరంలో ఊబిలో కూరుకుపోయి ఓ ఏనుగు మృతి చెందింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.