విద్యుత్‌ కార్మికుల చర్చలు సఫలం- సమ్మె వాయిదా

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 19 Oct 2019 5:41 PM IST

విద్యుత్‌ కార్మికుల చర్చలు సఫలం- సమ్మె వాయిదా

హైదరాబాద్‌: విద్యుత్‌ కార్మిక సంఘాల నాయకులతో ఆ సంస్థ ఎండి జిరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు 1104 యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా తెలిపారు. అయితే వివిధ డిమాండ్ల పరిష్కారించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మెల నోటీస్‌ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ సీఎండీ ఈ రోజు కార్మిక సంఘాల నేతలతో నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. విద్యుత్‌ బోర్డు తరుపున ఆ సంస్థ సిఎండీ ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. అయితే ఆర్టిజన్లకు ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ ఏర్పాటు చేసే విషయంలో యాజమాన్యాలు సానుకూలంగా స్పందించినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. గతంలో విద్యుత్‌ ఉద్యోగులకు అమలు చేసిన జీపీఎఫ్ విధాన్ని మళ్లీ కొనసాగించాలని కార్మిక సంఘాల నేతలు ప్రధానంగా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా యాజమాన్యం కోరింది. సానుకూల వాతావరణంలో చర్చలు జరగడంలో సమ్మెను తాత్మాలికంకగా వాయిదా వేసినట్లు కార్మిక సంఘాల నేతలు చెప్పారు. నవంబరు మూడో వారంలో మరోసారి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరపనున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి.

Next Story