ఎన్నికల పోలింగ్‌ బహిష్కరించిన ఓటర్లు

By సుభాష్  Published on  3 Nov 2020 4:06 AM GMT
ఎన్నికల పోలింగ్‌ బహిష్కరించిన ఓటర్లు

బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరుగుతోంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్‌ ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ రోజు జరిగే పోలింగ్‌లొఓ 2.85 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అయితే రోసిరా పరిధిలో 133,134 పోలింగ్‌ స్టేషన్‌లలో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్నో ఏల్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా.. నాయకులు పట్టించుకోవడం లేదని ఓటర్లు మండిపడ్డారు. ఇందుకే ఓటింగ్‌కు దూరంగా ఉన్నామని చెబుతున్నారు.

బీహార్‌తో పాటు 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. మధ్యప్రదేశ్‌ 28 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్‌ 8, ఉత్తరప్రదేశ్‌ 7 స్థానాలకు ఉప ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. ఒడిశా, నాగాలాండ్‌, కర్ణాటక, జార్ఖండ్‌లలో రెండేసి స్థానాలకు , ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ (దుబ్బాక), హర్యానాలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.

ఇక వృద్దులు, కోవిడ్‌ లక్షణాలున్నవారు పోస్ట్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని చర్యలు పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే పోలింగ్‌ కొనసాగుతోంది.

Next Story