బీహార్‌లో ప్రారంభమైన ఎన్నిక పోలింగ్‌

By సుభాష్  Published on  3 Nov 2020 2:23 AM GMT
బీహార్‌లో ప్రారంభమైన ఎన్నిక పోలింగ్‌

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మూడు విడతల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికారులు భారీ ఎత్తున కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా చెబుతున్న రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య పోలింగ్‌ కొనసాగుతోంది. ఇందు లో 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

కాగా, మహాకూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (రాఘోపూర్‌) , ఆయన సోదరుడు తేజప్రతాప్‌ యాదవ్‌ హసన్‌పూర్‌), పోటీ చేస్తున్న స్థానాల్లో ఈ రోజు పోలింగ్‌ కొనసాగుతోంది. నీతీష్‌ ప్రభుత్వంలో మంత్రలుగా ఉన్న నందకిశోర్‌ యాదవ్‌(బీజేపీ పాట్నాసాహెబ్‌), శ్రవణ్‌ కుమార్‌ (జేడీయూ, నలంద), రామ్‌సేవక్‌ సింగ్‌ (జేడీయూ థువా), రాణా రణ్‌ ధీర్‌సింగ్‌ (బీజేపీ, మధుబన్‌)ల నుంచి పోటీలో ఉన్నారు. కాగా, అక్టోబర్‌ 28న తొలి పోలింగ్‌ జరుగగా, 53.4శాతం పోలింగ్‌ నమోదైంది. 71 స్థానాల్లో 1066 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Next Story
Share it