ఉత్తర్‌ ప్రదేశ్‌: ఇద్దరు స్నేహితులు పంతానికి పోయి పందెం కాశారు. కాసేపలా కబుర్లు చెప్పుకొంటూ గుడ్లు తిందామని వెళ్లిన ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన వాగ్వాదం…పందేనికి దారి తీసింది. ఆ పందెం పంతానికి దారి తీసింది. చివరకు ఓ ప్రాణం గాల్లో కలిసిపోయేలా చేసింది. అయితే 50 గుడ్లు తింటే రూ.2 వేలంటూ ఇద్దరూ పందెం కాసుకున్నారు. సుభాష్‌ యాదవ్‌(42) అనే వ్యక్తి గుడ్లు తినడం మొదలెట్టాడు. నలభై ఒకటో గుడ్డును పూర్తి చేసి 42వ గుడ్డు తినడం మొదలు పెట్టేసరికి సుభాష్‌యాదవ్‌ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.