టీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రభావం..ఏపీపై ఉండదు: మంత్రి పేర్ని నాని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2019 1:23 PM GMT
అమరావతి: తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీలో ఆర్టీసీ కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందన్నారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనన్నారు. కాగా తెలంగాణ హైకోర్టులో సమ్మెపై విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత.. ఆర్టీసీని రెండుగా విభజించారని దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందించారు. విభజన జరగలేదన్న కేంద్రం.. ఏపీ, తెలంగాణకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సులు నిధులు ఎలా కేటాయించిందన్నారు. విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Next Story