సివిల్స్-2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..టాప్-10లో ఉన్నది వీళ్లే

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ -2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి.

By Knakam Karthik
Published on : 22 April 2025 2:33 PM IST

Education News, UPSC, Civils-2024 Final Resuts Released

సివిల్స్-2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..టాప్-10లో ఉన్నది వీళ్లే

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ -2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ రిజల్ట్స్‌ను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేయగా.. ఇందులో జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక ఆల్ ఇండియాలో శక్తి దూబే, హర్షిత్ గోయల్, తొలి రెండు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థి సాయి శివాణి 11వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.

Next Story