తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం

TSRTC to provide free bus ride for students to SSC exam centre.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2022 9:00 AM GMT
తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. ఆర్టీసీని ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేయాల‌నే సంక‌ల్పంతో స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో సంస్థలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. పండుగ‌లు,సెల‌వు రోజులు, ప్ర‌త్యేక రోజుల్లో ఆఫ‌ర్లు, రాయితీల‌ను ప్ర‌క‌టిస్తూ.. ప్రయాణికులు బ‌స్సుల్లో ప్ర‌యాణించేలా చూస్తూ సంస్థ ఆదాయాన్నిపెంచుతున్నారు. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలకు స్పందించడమే కాకుండా, అనేక పరిష్కార చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులంద‌రూ బ‌స్సులో ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మే 23నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు ఇంటి నుంచి ప‌రీక్షా కేంద్రానికి, ప‌రీక్షా కేంద్రం నుంచి ఇంటికీ ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. విద్యార్థులు ప్ర‌స్తుతం క‌లిగి ఉన్న బ‌స్ పాస్ వ్యాలిడిటీని జూన్ 1వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప‌రీక్ష‌లు జ‌రిగే రోజుల్లో విద్యార్థులు బ‌స్‌పాస్‌తో పాటు త‌మ హాల్‌టికెట్లు చూపించి ఉచితంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చున‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

Next Story