రేపు ఉదయం 11.30 గంటలకు టీఎస్ పాలిసెట్ - 2022 ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీఎస్ పాలిసెట్ అధికారులు వివరాలు వెల్లడించారు. జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.
పాలీసెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.