తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే

TS Intermediate Exam Time Table 2023 released.తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2022 11:29 AM IST
తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 15 నుంచి ప్రారంభం అయ్యే ప‌రీక్ష‌లు ఏపిల్ 4న ముగియ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార్చి 2 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వ‌ర‌కు నిర్వహించనున్నారు. 100శాతం సిల‌బ‌స్‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఛాయిస్ ప్ర‌శ్న‌ల సంఖ‌ను పెంచారు. ఇప్పుడు వాటిని తొల‌గించారు. క‌రోనా మునుపు ఉన్న రీతిలోనే ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:

15-03-2023 2nd లాంగ్వేజ్ పేప‌ర్ 1

17-03-2023 ఇంగ్లీష్ పేప‌ర్ 1

20-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 1ఏ / బోట‌నీ పేప‌ర్ 1 /పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ 1

23-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 1బి /జువాల‌జీ పేప‌ర్ 1 /హిస్ట‌రీ పేప‌ర్ 1

25-03-2023 ఫిజిక్స్ పేప‌ర్ 1 /ఎక‌నామిక్స్ పేప‌ర్ 1

28-03-2023 కెమిస్ట్రీ పేప‌ర్ 1 /కామ‌ర్స్ పేప‌ర్ 1

31-03-2023 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్

03-04-2023 మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ

ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:

16-03-2023 2nd లాంగ్వేజ్ పేప‌ర్ 2

18-03-2023 ఇంగ్లీష్ పేప‌ర్ 2ఏ

21-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 2ఏ /బోట‌నీ పేప‌ర్ 2 /పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ 2

24-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 2బి / జువాల‌జీ పేప‌ర్ 2 /హిస్ట‌రీ పేప‌ర్ 2

27-03-2023 ఫిజిక్స్ పేప‌ర్ 2 /ఎక‌నామిక్స్ పేప‌ర్ 2

29-03-2023 కెమిస్ట్రీ పేప‌ర్ 2 /కామ‌ర్స్ పేప‌ర్ 2

01-04-2023 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్

04-04-2023 మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ

Next Story