ఇంటర్ ఫలితాలు విడుదల.. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
TS Inter Results release by Minister Sabitha Indra Reddy.తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి.
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2022 11:58 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. సెకండ్ ఇయర్‌లో 67.82 శాతం మంది పాస్ అయ్యారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు.
మొదటి సంవత్సరం పరీక్షలను 4,64,892 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,94,378 మంది(63.32శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3శాతం కాగా.. అబ్బాయిలు 54.24 శాతం
ఇక రెండవ సంవత్సరం ఫలితాల్లో 67.82 శాతం ఉత్తీర్ణత కాగా.. ఇందులో అమ్మాయిలు 75.82 శాతంగా ఉండగా, 59.21 శాతం అబ్బాయిలు పాస్ అయ్యారు.
ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిన గత రెండు సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఆన్‌లైన్‌లో ద్వారా పాఠాలు చెప్పాం. గతేడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్‌లు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తామని, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుల చేస్తామన్నారు.