అల్ట‌ర్‌.. మే 6 నుంచి తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు.. షెడ్యూల్ ఇదే

TS Inter Exams starts from May 6.తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 7:17 AM GMT
అల్ట‌ర్‌.. మే 6 నుంచి తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు.. షెడ్యూల్ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను బుధ‌వారం ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. మే 6 నుంచి 24 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు మే 6 నుంచి 23 వ‌ర‌కు, సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు మే 7 నుంచి 24 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు నిర్వ‌హించ‌న‌ట్లు అధికారులు తెలిపారు.

మొద‌టి సంవ‌త్స‌రం షెడ్యూల్..

మే 6 – సెకండ్ లాంగ్వేజ్

మే 9 – ఇంగ్లీష్

మే 11 – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్

మే 13 – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ

మే 16 – ఫిజిక్స్, ఎక‌నామిక్స్

మే 18 – కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 20 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1

మే 23 – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

సెకండియ‌ర్ షెడ్యూల్

మే 7 – సెకండ్ లాంగ్వేజ్

మే 10 – ఇంగ్లీష్

మే 12 – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్

మే 14 – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ

మే 17 – ఫిజిక్స్, ఎక‌నామిక్స్

మే 19 – కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 21 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2

మే 24 – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి


Next Story