వెబ్‌సైట్‌లో తెలంగాణ ఇంట‌ర్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS Inter Exams hall tickets available in Inter Board Website.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 9:20 AM IST
వెబ్‌సైట్‌లో తెలంగాణ ఇంట‌ర్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌ల కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంట‌ర్ బోర్డ్ కార్య‌ద‌ర్శి స‌య్య‌ద్ ఒమ‌ర్ జ‌లీల్ తెలిపారు. ఇంట‌ర్ మొద‌టి, రెండ‌వ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను వైబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు చెప్పారు. కాలేజీ యాజ‌మాన్యాలు విద్యార్థుల‌ను ఇబ్బందులు పెడితే.. నేర‌గా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చున‌న్నారు.

www.tsbie.gov.in నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంత‌కం లేకుండానే ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావొచ్చున‌ని, అలాంటి వారిని కూడా అనుమ‌తించాల‌ని చీఫ్ సూప‌రింటెండెంట్ల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. హాల్‌టికెట్ల‌పై ముద్రించిన పేరు, ఫోటో, సంత‌కం, మీడియం, స‌బ్జెక్టులు వంటి వివ‌రాల‌ను ఓ సారి స‌రిచూసుకోవాల‌ని, ఏవైనా త‌ప్పులుంటే ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంట‌ర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవాల‌ని సూచించారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. ఇందుకోసం 1,443 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. జేఈఈ మెయిన్ పరీక్ష‌ల తేదీల మార్పు కార‌ణంగా ఇంట‌ర్ ప‌రీక్ష తేదీల్లో మార్పులు చేశారు. తాజా షెడ్యూల్ ప్ర‌కారం తెలంగాణ‌లో మే 6 నుంచి 23 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Next Story