తెలంగాణ‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. చాయిస్ డ‌బుల్‌

TS Inter board taking key decision.తెలంగాణ‌లో ఇంట‌ర్ చ‌దివే విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. వార్షిక ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 3:48 AM GMT
తెలంగాణ‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. చాయిస్ డ‌బుల్‌

తెలంగాణ‌లో ఇంట‌ర్ చ‌దివే విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. వార్షిక ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌ల ఛాయిస్‌ను రెట్టింపు చేస్తూ ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో కొన్ని సెక్ష‌న్ల‌లో మాత్ర‌మే ఛాయిస్ ఇచ్చేశారు. అయితే.. ఈ ఏడాది నుంచి అన్ని సెక్ష‌న్ల‌లో ప్ర‌శ్న‌ల సంఖ్య‌ను పెంచి.. ఛాయిస్‌గా వ‌దిలేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియాల మాదిరి(న‌మూనా) ప్రశ్నపత్రాలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. పోయిన సంవ‌త్సరం వ‌ర‌కు మూడు సెక్షన్లకుగాను రెండింటిలో మాత్రమే 50 శాతం చాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్ర‌శ్న‌ల‌ను ఇస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తిలో పరీక్షలు రాయకుండానే పాసయ్యారు. పైగా గతేడాది నిర్వహించిన పరీక్షల్లో అత్యధికులు ఫెయిల్‌ కావడంతో చాయిస్‌ ప్రశ్నలు పెంచి మోడల్‌ ప్రశ్నపత్రాలను సిద్ధంచేశారు.

చాయిస్‌లు ఇలా..

- రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం సెక్షన్‌ -ఏలో 15 ప్ర‌శ్న‌లు ఇస్తారు. వాటిలో 10 ప్రశ్నలకు స‌మాధానాలు రావాలి. ఐదు చాయిస్‌. సెక్షన్‌ -బీలో 13 ప్రశ్నలకు ఆరింటికి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్‌ -సీలో నాలుగింటిలో రెండింటికి సమాధానం ఇవ్వాలి.

- గణితం సెక్షన్‌ -ఏలో 15 ప్రశ్నలకు గాను పదింటికి సమాధానాలు రాయాలి. ఐదు ప్రశ్నలను చాయిస్‌గా వదిలేసుకొనే అవకాశమిచ్చారు. గతేడాది ఈ సెక్షన్‌లో మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. సెక్షన్‌ -బీలో 11 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఆరు ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్‌ -సీలో 9 ప్రశ్నలు ఉంటాయి. ఐదింటికి సమాధానాలిస్తే సరిపోతుంది. నాలుగు ప్రశ్నలు చాయిస్‌.

- అర్ధశాస్త్రం సెక్షన్‌ – ఏలో ఏడు ప్రశ్నలకు మూడింటికి సమాధానాలు రాయాలి. నాలుగు ప్రశ్నలు చాయిస్‌. సెక్షన్‌ -బీలో 17 ప్రశ్నల్లో 8 సమాధానాలు రాయాలి. 9 ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్‌ -సీలో 15 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 24 ప్రశ్నలిచ్చారు. 9 ప్రశ్నలు చాయిస్‌

- ఇంగ్లిష్‌లో సెక్షన్‌ -ఏలో ఐదు ప్రశ్నలిచ్చారు. రెండింటికి సమాధానం రాయాలి. సెక్షన్‌ -బీలో ఆరు ప్రశ్నలకుగాను నాలుగింటికి సమాధానాలిస్తే సరిపోతుంది. సెక్షన్‌ -సీలో 50 శాతం ప్రశ్నలను చాయిస్‌గా ఇచ్చారు.

- తెలుగులో సెక్షన్‌ -1 లో 8 మార్కుల ప్రశ్నలు మూడిచ్చి ఒకటి రాసుకొనే అవకాశమిచ్చారు. సెక్షన్‌ -2, 3లలో 6 మార్కుల ప్రశ్నలు మూడింట్లో ఒకదానికి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్‌ -4లో 4 మార్కులవి 5 ప్రశ్నలివ్వగా, రెండింటికి, సెక్షన్‌ 5, 6లలో 3 మార్కులవి 6 ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలివ్వాలి. సెక్షన్‌ 7, 8లలో 2 మార్కులవి ఐదు ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. సెక్షన్‌ 9, 10లలోనూ చాయిస్‌ ప్రశ్నలను పెంచారు.

Next Story