సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే.. ఈ నెల 12( రెండో శనివారం) న ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవును రద్దు చేసింది ప్రభుత్వం. అయితే.. ఇది రాష్ట్రం మొత్తానికి కాదు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు మాత్రమే.
ఈ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు నవంబర్ 12న యథావిధిగా పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం ఈ జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు బదులుగా రేపు పనిదినంగా పాటించాలని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రానున్న సెలవులు ఇవే
- క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు
- జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
- వేసవి సెలవులు 25 ఏప్రిల్ 2023 నుంచి 11 జూన్ 2023 వరకు