తెలంగాణ‌లో ఎంసెట్ షెడ్యూల్ విడుద‌ల‌

TS Eamcet Schedule released.తెలంగాణలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టీఎస్ ఎంసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్న‌త

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 6 March 2021 5:27 PM IST

TS Eamcet Schedule released

తెలంగాణలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టీఎస్ ఎంసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి శ‌నివారం ఖారారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మార్చి 20 నుంచి మే 18 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించనున్నారు. జులై 5వ తేదీన అగ్రికల్చర్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. జులై 6న మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. జులై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సు అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష పెట్ట‌నున్నారు. ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి 100 శాతం, సెకండియర్‌ నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది.


Next Story