తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే

TS EAMCET 2022 counselling schedule released.ఎంసెట్‌ కౌన్సెలింగ్ తేదీల‌ను ఉన్న‌త విద్యాశాఖ మండ‌లి విడుద‌ల చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 4:29 AM GMT
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ ఫ‌లితాలు శుక్ర‌వారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ ఫ‌లితాల్లో విద్యార్థులు ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. ఈసెట్ ప‌రీక్ష‌లో 90.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 80.4 శాతం, అగ్రిక‌ల్చ‌ర్ విభాగంలో 88.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఈ క్ర‌మంలో ఎంసెట్‌,ఈ-సెట్‌ల‌కు కౌన్సెలింగ్ తేదీల‌ను ఉన్న‌త విద్యాశాఖ మండ‌లి విడుద‌ల చేసింది. మొత్తం మూడు విడుత‌ల్లో కౌన్సెలింగ్‌ను చేప‌ట్ట‌నున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21న మొద‌లు కానుండా.. తుది విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది.

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్..

తొలి విడ‌త‌..

- ఆగ‌స్టు 21 నుంచి ఆగ‌స్టు 29 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్

- ఆగ‌స్టు 23 నుంచి ఆగ‌స్టు 30 వరకు స‌ర్టిఫికెట్ల పరిశీలన

- ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు

- సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు

రెండో విడత..

- సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్

- సెప్టెంబరు 30న స‌ర్టిఫికెట్ల పరిశీలన

- సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు

- అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

మూడో విడత..

అక్టోబరు 11 నుంచి 17 వ‌ర‌కు తుది విడత కౌన్సెలింగ్

- అక్టోబరు 13న ధ్రువపత్రాల పరిశీలన

- అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

- అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయ‌నున్నారు.

Next Story