ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. కొత్త షెడ్యూల్ ఇదే
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్ విడుదలైంది.
By అంజి Published on 1 Feb 2025 1:45 PM ISTఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. కొత్త షెడ్యూల్ ఇదే
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్ విడుదలైంది. జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ అందుబాటులోకి రాలేదు. జనవరి 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 1 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. రూ.2000 ఫైన్‌తో మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఒరియంటల్ లాంగ్వేజెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేష్, లా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులు, ఇతరులు 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు. 70 మార్కులకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన వారు, యూజీసీ నెట్, సీఎస్‌ఐఆరర్, ఐసీఎంఆర్ ఉత్తీర్ణులైనవారు ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. లాంగ్వేజ్‌లు తప్ప మిగిలినవి ఇంగ్లీష్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.