తెలంగాణలో పదో తరగతి పరీక్ష తేదీలను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ తెలిపారు. గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. అయితే.. ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్‌మెంట్) టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు. మొదటి ఎఫ్ఏను మార్చి 15న, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వహించనున్నారు. సమ్మేటివ్ అసెస్‌మెంట్‌ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించనున్నారు.
ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ప్రకారం 9,10 తరగతుల విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ పాఠశాలలు ప్రారంభం పునః ప్రారంభకానున్నాయి. లాస్ట్ వర్కింగ్ డే 26 మే 2021 కాగా.. వేసవి సెలవులు మే 26 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఉండనున్నాయి. సరిపడా హాజరు లేనప్పటికి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతించనున్నారు. ఇది ఇలా ఉండగా.. ఫిజికల్ క్లాసులు 89 పనిదినాలు కాగా.. డిజిటల్ తరగతులు 115 రోజులుగా ఉండనున్నాయి. 2020-21 విద్యాసంత్సరానికి 204 పని దినాలు ఉండనున్నాయి. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే... గ్రామీణ, పట్టణాల్లో 9.30 నుండి 4.45 వరకు కాగా.. హైదరాబాద్ లో 8.45 నుండి 4 గంటల వరకు పాఠశాలలు నడువనున్నాయి.