Telangana: టెన్త్ హాల్‌ టికెట్లు విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?

తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ మార్చి 7, గురువారం ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) హాల్ టికెట్లను విడుదల చేసింది.

By అంజి  Published on  8 March 2024 12:48 AM GMT
Telangana, SSC exam, hall tickets

Telangana: టెన్త్ హాల్‌ టికెట్లు విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ మార్చి 7, గురువారం ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) హాల్ టికెట్లను విడుదల చేసింది. మార్చి 2024లో తెలంగాణ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అధికారిక బీఎస్‌ఈ తెలంగాణ వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయవచ్చు .

హాల్ టిక్కెట్లు, ముద్రించిన నామినల్ రోల్స్‌ను జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను స్కూల్ హెడ్ మాస్టర్ నుండి తీసుకోవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పరీక్ష మార్చి 18న ప్రారంభమై ఏప్రిల్ 2, 2024న ముగుస్తుంది. పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడతాయి. అధికారిక షెడ్యూల్ ప్రకారం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పార్ట్ బి పరీక్ష చివరి అరగంటలో పూర్తి చేయాలి.

ప్రభుత్వ సెలవులు లేదా ఆ తేదీల్లో ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవులు ఉన్నప్పటికీ, మార్చి 2024లో జరిగే ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు జారీ చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం నిర్వహించబడుతుంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు బీఎస్‌ఈ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు

హాల్‌ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

హోమ్ పేజీలో టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.

అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ తెరవబడుతుంది.

సబ్మిట్‌పై క్లిక్ చేయండి.

మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

Next Story