Telangana: ఎస్‌ఏ-2 పరీక్షలను వాయిదా వేసిన విద్యాశాఖ

ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 4:34 PM IST
telangana, schools, SA-2 exams,

Telangana: ఎస్‌ఏ-2 పరీక్షలను వాయిదా వేసిన విద్యాశాఖ

ఎండలు దంచి కొడుతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. మధ్యాహ్న సమయంలో అయితే ఎండ వేడిమి మరింత పెరిగిపోయి.. జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎండల కారణంగా తెలంగాణలో ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక పేరెంట్స్ మీటింగ్ తర్వాత స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించునున్నారు.

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక ఆ తర్వాత 8వ తరగతి పరీక్షలు 9 నుంచి 11.45 గంటల వరకు.. తొమ్మిదో తరగతి పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎస్‌ఏ-2 పరీక్షలు వాయిదా పడినట్లు డీఈవోలు, స్కూళ్ల ప్రిన్సిపల్స్, విద్యార్థులు గమనించాలని అధికారులు చెప్పారు.

Next Story