తెలంగాణ లాసెట్‌ ఫలితాలు విడుదల.. ఈజీగా ఇలా చెక్‌ చేసుకోండి

Telangana LAWCET Results released.. Check this easily. తెలంగాణ లాసెట్‌, పీజీ లా సెట్‌ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్‌

By అంజి  Published on  17 Aug 2022 5:26 PM IST
తెలంగాణ లాసెట్‌ ఫలితాలు విడుదల.. ఈజీగా ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ లాసెట్‌, పీజీ లా సెట్‌ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్‌ లింబాద్రి.. లాసెట్‌, పీజీలాసెట్‌ ఫలితాలు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tsche.ac.in/లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రెండు సెట్లలో కలిపి మొత్తం 74 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి తెలిపారు. వీటిల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష రాసిన వారిలో 74.76 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు 68.57 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పీజీ లాసెట్‌లో 91.10 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులైనట్లు ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఏడాది జూలై 21, 22 తేదీల్లో జరిగిన లాసెట్‌, పీజీలాసెట్‌ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది విద్యార్ధులు ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి.

https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి. అందులో లేటెస్ట్‌ అప్‌డేట్స్‌లో డౌన్‌లోడ్‌ ర్యాంక్‌ కార్డ్‌ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయండి. ఆ వెంటనే లా సెట్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంటర్‌ చేయండి. ఆ తర్వాత వ్యూ ర్యాంక్‌ కార్డ్‌పై క్లిక్‌ చేయండి. మీ రిజల్ట్స్‌ చూసుకోండి.

Next Story