ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inకి వెళ్లి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ రిలీజ్ చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను మాత్రమే రిలీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఫస్టియర్ పరీక్ష ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.
కాగా తాజాగా ప్రకటించిన ఫలితాల్లో జనరల్‌లో 47.74 శాతం, ఒకేషన్‌లో 65.07 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. అలాగే బాలికలు 53.59 శాతం, బాలికలు 44.43 శాతం పాస్ అయ్యారు. పాస్ పర్సెంటేజ్‌లో ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. రీకౌంటింగ్ కోసం సెప్టెంబర్ 5 నుండి 8 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుండి 10, 2022 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. గతంలో ఇంటర్ బోర్డు.. ఇంటర్ పరీక్ష సాధారణ ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 67.16 శాతంగా నమోదైంది. టీఎస్ ఇంటర్ రెండో సంవత్సరం రెగ్యులర్ పరీక్షకు మొత్తం 4,42,895 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,97,458 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
మొదట https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో 'ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే బాక్స్‌లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి