తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న రోజు రానే వచ్చింది. నేడు(మంగళవారం) ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి సబితా సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.
ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి 24 వరకు జరిగాయి. మొత్తం 9లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4.64లక్షల మందికాగా.. ద్వితియ సంవత్సరం విద్యార్థులు 4.39లక్షల మంది. కరోనా కారణంగా 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించారు. ఇక ఫలితాలు వెలువడిన అనంతరం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడి 15 రోజుల్లోనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఇప్పటికే ప్రకటించారు.
ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in,https://results.cgg.gov.in,https://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో చూడొచ్చు.