తెలంగాణా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ ప‌రీక్ష అంటే..?

Telangana Inter Exams Schedule Released.తెలంగాణలో ఇంటర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2021 1:34 PM GMT
Telangana Inter Exams Schedule Released

తెలంగాణలో ఇంటర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. మే 1 నుంచి 20 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మే 13తో ఇంటర్ ప్రధాన(సబ్జెక్టు లు) పరీక్షలు ముగియనున్నాయి. అయితే సమయాభావం కారణంగా ఆదివారం కూడా పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7 నుండి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 3 న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది.

మే 17 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యేలా షెడ్యూల్ సిద్దం చేశారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్ష షెడ్యూల్‌

మే 1న ఇంటర్‌ ఫస్టియర్‌ పేపర్‌-2

మే 3న ఇంగ్లిష్‌ పేపర్‌-1

మే 5న మ్యాథ్స్‌ పేపర్‌-1ఏ,

బోటనీ-1,

సివిక్స్‌-1

సైకాల‌జీ పేప‌ర్‌-1

మే 7న మ్యాథ్స్‌ పేపర్‌-1బీ,

జువాలజీ-1,

హిస్టరీ-1

మే 10న ఫిజిక్స్ పేపర్‌-1‌,

ఎకనామిక్స్‌-1

క్లాసిక‌ల్ లాంగ్వేజ్ పేప‌ర్‌-1

మే 12న కెమిస్ట్రీ పేప‌ర్‌1,

కామర్స్ పేప‌ర్ -1,

సోషియాలజీ పేప‌ర్-1,

ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేప‌ర్‌-1

మే 17న జియాల‌జీ పేప‌ర్‌-1,

హోం సైన్స్ పేప‌ర్‌-1,

ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్‌-1,

లాజిక్ పేప‌ర్‌-1,

బ్రిడ్జ్ కోర్స్ గ‌ణితం పేప‌ర్‌-1(బైపీసీ విద్యార్దుల‌కు)

మే 19న మోడ్ర‌న్ లాంగ్వేజ్ పేప‌ర్‌-1,

జాగ్ర‌ఫీ పేప‌ర్‌-1,

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌

మే 2న సెకండ్ లాంగ్వేజ్‌‌ పేపర్‌-2

మే 4న ఇంగ్లిష్‌ పేపర్‌-2

మే 6న మ్యాథ్స్‌ పేపర్‌-2ఏ,

బోటనీ పేప‌ర్‌-2,

సివిక్స్ పేప‌ర్‌-2

సైకాల‌జీ పేప‌ర్‌-2

మే 8న మ్యాథ్స్‌ పేపర్‌-2బీ,

జువాలజీ పేప‌ర్‌-2,

హిస్టరీ పేప‌ర్‌-2

మే 11న ఫిజిక్స్‌ పేపర్‌-2,

ఎకనామిక్స్ పేప‌ర్‌-2

క్లాసిక‌ల్ లాంగ్వేజ్ పేప‌ర్‌-2

మే 13న కెమిస్ట్రీ పేపర్‌-2,

కామర్స్ పేప‌ర్‌-2,

సోషియాలజీ పేపర్‌-2

ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేప‌ర్‌-2,

మే 18న జియాల‌జీ పేప‌ర్‌-2,

ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్‌-2,

లాజిక్ పేప‌ర్‌-2,

బ్రిడ్జ్ కోర్స్ గ‌ణితం పేప‌ర్‌-2(బైపీసీ విద్యార్థుల‌కు)


మే 20న మోడ్ర‌న్ లాంగ్వేజ్ పేప‌ర్‌-2,

జాగ్ర‌ఫీ పేప‌ర్‌-2.




Next Story