TS Inter Academic Calendar 2023-24 : అల‌ర్ట్.. తెలంగాణ‌లో జూన్ 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం

తెలంగాణ ఇంట‌ర్ బోర్డు 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించిన అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2023 1:22 PM IST
Inter Academic Calendar 2023-2024, Telangana

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

తెలంగాణ ఇంట‌ర్ బోర్డు 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించిన అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇంట‌ర్ మొద‌టి, రెండ‌వ సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు వెల్ల‌డించింది. అంతేకాకుండా పండుగ సెల‌వుల‌ను కూడా విడుద‌ల చేసింది.

అక్టోబ‌ర్ 19 నుంచి 25 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వుల‌ను ఉండ‌నున్నాయి. కాలేజీలు తిరిగి 26 న పునఃప్రారంభం కానున్నాయి. న‌వంబ‌ర్ 20 నుంచి 25 వ‌ర‌కు అర్థ‌సంవ‌త్స‌రం పరీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు. 2024 జ‌న‌వ‌రి 13 నుంచి 16 వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఉంటాయ‌ని తెలిపింది. తిరిగి 17న‌ ఇంట‌ర్ క‌ళాశాల‌ల త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు జ‌న‌వ‌రి 22 నుంచి 29 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో ప్రాక్టిక‌ల్స్, మార్చి మొద‌టి వారంలో వార్షిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు తెలిపింది

Next Story