ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 15 నిమిషాలు ఆల‌స్య‌మైనా

Telangana Inter Board good news to students.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2022 5:00 AM GMT
ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 15 నిమిషాలు ఆల‌స్య‌మైనా

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ఇంట‌ర్ బోర్డు శుభవార్త చెప్పింది. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లకు 15 నిమిషాలు ఆల‌స్యం అయినా లోనికి అనుమ‌తించాల‌ని కాలేజీల‌ను ఆదేశించింది ఇంట‌ర్ బోర్డు. ఆ త‌రువాత వ‌చ్చిన విద్యార్థుల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్షా కేంద్రంలోని అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ఇంట‌ర్మీడియెట్ బోర్డు కార్య‌ద‌ర్శి జ‌లీల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఇక విద్యార్థులకు వారు చదువుకుంటున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. అయితే.. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఇక ఎగ్జామినర్లుగా నియమించిన అధ్యాపకులను విధుల నుంచి రిలీజ్ చేయాలని.. అలా చేయ‌ని ప‌క్షంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు/యాజమాన్యాలకు రూ. 5 వేల వరకు ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపింది. ఇక విద్యార్థులకు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 08 గంటలలోపు ఆన్ లైన్ లో బోర్డుకు పంపాలని సూచించింది.

Next Story
Share it