తెలంగాణ‌ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Telangana EDCET 2022 notification released.తెలంగాణ‌ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 7:40 AM GMT
తెలంగాణ‌ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ‌ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభంకానుంది. ఆల‌స్య రుసుం రూ.250తో జులై 1 వ‌ర‌కు రూ.500 ల ఆల‌స్య రుసుంతో జులై 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చునని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు

ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. జులై 26, 27 తేదీల్లో ఎడ్‌సెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 220 బీఎడ్ కాలేజీల్లో 19,600 బీఎడ్ సీట్లు ఉన్నాయి. 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవ‌త్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు అర్హులే.

Next Story