తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ రిలీజ్‌ అయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకు

By అంజి  Published on  24 Feb 2023 12:57 PM IST
Telangana, EAMCET schedule, Exam Notification

తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

జినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే.. తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ రిలీజ్‌ అయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూలును విడుదల చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడనుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు. లేట్‌ ఫీజుతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 12 నుంచి 14వ తేదీ వరకు ఎడిట్‌ చేసుకునే ఛాన్స్‌ కల్పించారు. 250 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2500 రూపాయల లేట్ ఫీజు తో ఏప్రిల్ 25 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 5000 రూపాయల లేట్ ఫీజుతో మే 2 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది.

షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష పరీక్ష ఉంటుంది.

Next Story