Telangana: ఎంసెట్ ఫలితాలు రిలీజ్.. రిజల్ట్‌ ఇలా చూసుకోండి

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

By అంజి  Published on  25 May 2023 4:46 AM GMT
Telangana  EAMCET, EAMCET Results, Exam Results, Education

Telangana: ఎంసెట్ ఫలితాలు రిలీజ్.. రిజల్ట్‌ ఇలా చూసుకోండి

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి సబితా వెల్లడించారు. తెలంగాణ 15 జోన్లు, ఏపీలో 6 జోన్లలో పరీక్ష నిర్వహించారని మంత్రి సబితా తెలిపారు.

అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 1,10544 మంది పరీక్ష రాయగా.. 91,935 మంది విద్యార్థులు (86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో పరీక్ష రాసిన వారిలో 1,56,879 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం ఉత్తీర్ణులు కాగా, 82 శాతం మంది అమ్మాయిలు పాసయ్యారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా.. అమ్మాయిలు 87 శాతం మంది పాసయ్యారు.

పరీక్షకు హాజరైన వారు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తారు.

ఎంసెట్ వెబ్ సైట్ లో ఇలా చూసుకోండి..

ముందుగా అభ్యర్థులు మీ స్మార్ట్‌ ఫోన్‌లో లేదా పీసీలో బ్రౌజర్‌ ఓపెన్‌ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న //https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. హోం పేజీలో ఎంసెట్ రిజల్ట్స్ 2023 అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

Next Story