Telangana: ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల తేదీలో మార్పు

ఇంటర్‌ సెకండియర్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది.

By -  అంజి
Published on : 16 Dec 2025 8:07 AM IST

Telangana, Inter Secondary Final Examinations, Inter Students, Inter Exams

Telangana: ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల తేదీలో మార్పు

హైదరాబాద్‌: ఇంటర్‌ సెకండియర్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. 4న హోళీ పండుగ ఉంటుందని భావించి షెడ్యూల్‌లో 3వ తేదీన పరీక్ష ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితాలో 3న హోళీ పండుగ సెలవు ఉంది. దీంతో ఈ మార్పు చేశారు. అటు ఫిబ్రవరి 2 నుంచి 21 ప్రాక్టికల్స్‌ ఉంటాయి. మొత్తం 3 విడతల్లో ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. 21న ఫస్టియర్‌, 22న సెకండియర్‌కు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

ఇంటర్‌ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై.. మార్చి 18 వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 25న ఫస్టియర్‌, 26న సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Next Story