తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా పరీక్షల షెడ్యూల్‌లో ఇంటర్ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. 29న జరగాల్సిన పరీక్షను 31వ తేదీకి, 30న జరగాల్సిన పరీక్షను నవంబరు 1వ తేదీకి మార్చినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారందరిని సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బావించింది. 25 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పరీక్షల షెడ్యూల్
అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లీష్, 27న మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, 28న మ్యాథ్స్-1బీ, జువాలజీ, హిస్టరీ, 31న ఫిజిక్స్, ఎకనామిక్స్, నవంబర్1న కెమిస్ట్రీ, కామర్స్, నవంబర్ 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 3న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు జరుగనున్నాయి.