నవంబర్‌లో పాఠశాలలకు ఐదు సెలవులు..!

నవంబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి.

By Kalasani Durgapraveen  Published on  4 Nov 2024 1:20 PM IST
నవంబర్‌లో పాఠశాలలకు ఐదు సెలవులు..!

నవంబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి. వీటిలో గురునానక్ జయంతి సెలవు కూడా ఉంది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో సాధారణ సెలవులు ఒక్క రోజే ఉండ‌టం గ‌మ‌నార్హం. గురునానక్ జయంతి సందర్భంగా ప్రభుత్వం నవంబర్ 15న సెలవు ప్రకటించింది. ఇది కాకుండా హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలు నవంబర్ 16 న “సయ్యద్ ముహమ్మద్ అల్-మహ్దీ అల్-మౌద్ జౌన్‌పురి పుట్టినరోజు” కార‌ణంగా సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది. అదికాకుండా నెలలో నాలుగు ఆదివారాలు ఉన్నాయి.

నవంబర్ 3: ఆదివారం

నవంబర్ 10: ఆదివారం

నవంబర్ 15: గురునానక్ జయంతి

నవంబర్ 16: సయ్యద్ ముహమ్మద్ అల్-మహదీ అల్-మౌద్ జాన్‌పురి పుట్టినరోజు

నవంబర్ 17: ఆదివారం

నవంబర్ 24: ఆదివారం

గత నెలలో నగరంలోని పాఠశాలలకు 16 సెలవులు రాగా.. అందులో దసరా సెలవులు 13 రోజులు ఉన్నాయి. సెలవుల తరువాత పాఠశాలలు అక్టోబర్ 21 నుండి 28 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA) 1ని నిర్వహించాయి.


Next Story