ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 ఏపీ మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ను...

By -  అంజి
Published on : 20 Feb 2026 9:01 AM IST

admission Schedule released, admissions , AP model schools, APnews

Schedule released for admissions in AP model schools

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 ఏపీ మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడమే ఈ పాఠశాలల ప్రధాన లక్ష్యం.

షెడ్యూల్‌ ఇలా.. ఫీజు చెల్లింపు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 24 నుంచి మొదలకానుంది. ఏప్రిల్‌ 12వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది. ఏప్రిల్‌ 27వ తేదీన మెరిట్‌, సెలక్షన్‌ లిస్టు విడుదల కానుంది. ఏప్రిల్‌ 30వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, జూన్‌ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని డైరెక్టర్‌ విజయరామ రాజు తెలిపారు.

మోడల్ స్కూల్స్ ప్రత్యేకతలు - ఎందుకు చేరాలి?

విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మరియు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాలికల కోసం పాఠశాల ఆవరణలోనే సురక్షితమైన హాస్టల్ సౌకర్యం ఉంటుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ మరియు డిజిటల్ బోధన అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ apms.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Next Story