జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

NTA Released JEE Main june session 1 results. జేఈఈ మెయిన్ మొదటి విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌

By అంజి  Published on  11 July 2022 4:16 AM GMT
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

జేఈఈ మెయిన్ మొదటి విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/లో విద్యార్థులు తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. జూన్‌ 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. ఈ నెల 6వ తేదీన ఫైనల్ కీని రిలీజ్ చేసింది. తాజాగా జేఈఈ మెయిన్‌ పేపర్ 1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది.

nta.ac.in, ntaresults.nic.in లో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన పి. ఆదినారాయణ, కే.సుహాస్‌, కే.ధీరజ్‌, అనికేత్‌ చటోపాధ్యాయ, రూపేశ్‌ 100 శాతం పర్సంటేజ్ సాధించారు. పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) ఫలితాలు విడుదల అవ్వాల్సి ఉంది. ఈఏడాది తెలంగాణ నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడత పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి

స్టెప్‌ 1: విద్యార్థులు మొదటగా jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్‌ 2: హోమ్ పేజీలో Download Score Card of JEE(Main) Session 1- Paper 1 అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

స్టెప్‌ 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

స్టెప్‌ 4: అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

Next Story