తెలంగాణలో ఎంసెట్, ఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 6 నుంచి ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

Notifications issued for TS EAMCET and ECET.తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌, ఈసెట్ నోటిఫికేష‌న్‌ల‌ను సోమ‌వారం ఉన్న‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2022 8:09 AM IST
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 6 నుంచి ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌, ఈసెట్ నోటిఫికేష‌న్‌ల‌ను సోమ‌వారం ఉన్న‌త విద్యామండ‌లి విడుద‌ల చేసింది. ఈ రెండింటి దర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏప్రిల్ 6 తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ కు ఈ ఏడాది సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లోని 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలిస్తారు. జూలై 14 నుంచి నిర్వహించే ఈ పరీక్షకు తెలంగాణలోని 18, ఏపీలోని 5 జోన్లలో 105 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్ర‌శ్నాప‌త్రం రెండు బాష‌ల్లో ఉండ‌నుంది. తెలుగు-ఇంగ్లీష్, ఉర్దూ-ఇంగ్లీష్‌లో ఉండ‌నుంది. కేవ‌లం ఇంగ్లీష్ లోనే ప్ర‌శ్నాప‌త్రం ఉండాల‌ని కోరుకునే వారికి అదే ఇస్తామ‌ని ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవ‌ర్థ‌న్ తెలిపారు.

ఎంసెట్ ముఖ్య‌మైన తేదీలు

దర‌ఖాస్తు ప్రారంభం - ఏప్రిల్ 6 నుంచి మే 28 వ‌ర‌కు

ఆల‌స్య రుసుంతో - జూన్ 7 నుంచి జులై 7 వ‌ర‌కు

ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పు స‌వ‌ర‌ణ - మే 30 నుంచి జూన్ 6 వ‌ర‌కు

ప‌రీక్ష తేదీ - జులై 14,15 తేదీల్లో అగ్రిక‌ల్బ‌ర్‌, 18,19,20 న ఇంజినీరింగ్‌

ద‌ర‌ఖాస్తు రుసుం - ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.400, ఇత‌రుల‌కు రూ.800

మ‌రిన్ని వివ‌రాల‌కు www.eamcet.tsche.ac.in

ఈ సెట్ ముఖ్యమైన తేదీలు

దర‌ఖాస్తు ప్రారంభం- ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వ‌ర‌కు

ఆల‌స్య రుసుంతో - జులై 7 వ‌ర‌కు

ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పు స‌వ‌ర‌ణ - జూన్ 15 నుంచి 20 వ‌ర‌కు

ప‌రీక్ష తేదీ- జులై 13

ద‌ర‌ఖాస్తు రుసుం- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.400, ఇత‌రుల‌కు రూ.800

Next Story