అలర్ట్..JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు రిలీజ్..ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

(జేఈఈ) మెయిన్ 2026 సెషన్-1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (అడ్మిట్ కార్డులు) విడుదలయ్యాయి.

By -  Knakam Karthik
Published on : 17 Jan 2026 8:46 PM IST

Education News, JEE Mains Admit Card, National Testing Agency

అలర్ట్..JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు రిలీజ్..ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్-1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (అడ్మిట్ కార్డులు) విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం ఈ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ నెల 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పేపర్-1 (బీ.టెక్/బీ.ఇ.) పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఎన్టీఏ ప్రస్తుతం జనవరి 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రమే హాల్ టికెట్లను జారీ చేసింది. జనవరి 28, 29 తేదీల్లో పరీక్షలు ఉన్నవారికి అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక పేపర్-2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్ష జనవరి 29న జరగనుంది.

పరీక్షలు రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని పరీక్షా కేంద్రం, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఏవైనా సమస్యలుంటే jeemain@nta.ac.inకు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి.

Next Story